తిరుపతి ఉప ఎన్నికల్లో సుగుణమ్మ ఘన విజయం

sugunamma-16

తిరుపతి: చిత్తూరు జిల్లా తిరుపతి ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి సుగుణమ్మ ఘన విజయం సాధించారు. భర్త వెంకటరమణ మృతి చెందడంతో ఉపఎన్నికల్లో పోటీచేసిన సుగుణమ్మ సమీప కాంగ్రెస్ అభ్యర్ధి శ్రీదేవిపై 1,16,324 ఓట్ల ఆధిక్యంతో ఘన విజయం సాధించారు. ఈ ఉప ఎన్నికల్లో మొత్తం 1,47,216 ఓట్లు పోలవ్వగా, అందులో టీడీపీకి 1,26,152 ఓట్లు, కాంగ్రెస్ కు 9628 ఓట్లు లభించాయి.

తిరుపతి ఉప ఎన్నికల్లో భారీ ఆధిక్యం రావడం సంతోషాన్నిచ్చిందని టీడీపీ అభ్యర్ధి సుగుణమ్మ తెలిపారు. దివంగతనేత వెంకట రమణ ఆశయాల మేరకు పనిచేస్తామని ఆమె పేర్కొన్నారు. ఎన్నికల సందర్భంగా తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమని ప్రజలు తమ ఓట్లతో తీర్పు చెప్పారన్నారు. తన గెలుపు సహకరించిన ప్రజలకు, టీడీపీ కార్యకర్తలకు సుగుణమ్మ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.  సమస్య పరిష్కరించడానికి ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటానని ఆమె హామీ ఇచ్చారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.