తిరుమలకు పోటెత్తిన భక్తులు

tirumala-31

భక్తులతో కిటకిటలాడుతున్న తిరుమల క్షేత్రం

తిరుమల, డిసెంబర్ 31: తిరుమల ఏడుకొండలు భక్తజనసంద్రంగా మారిపోయింది. నూతన సంవత్సరం, వైకుంఠ ఏకాదశి పర్వదినం ఒకే రోజు రావడం వల్ల తిరుమల భక్తులతో కిటకిటలాడుతున్నాయి. నడకమార్గం, వైకుంఠం, శ్రీనివాసం, మాడ వీధులు ఎక్కడ చూసినా ఇసుకేస్తే రాలనంతగా భక్తుల సందోహం కనిపిస్తుంది.  అదే విధంగా శ్రీవారి ఆలయంలో ఏడాదికి రెండు రోజులపాటు తెరిచి ఉంచే వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు.

గురువారం ఉదయం 5 గంటలకు క్యూలైన్ల ద్వారా భక్తులను అనుమతిస్తామని టీటీడీ అధికారులు ప్రకటించినప్పటికీ దాదాపు 20 గంటలు ముందుగానే భక్తులు క్యూ లైన్లలో చేరుకుంటున్నారు. దీంతో ఎంబీసీ ప్రాంతంలో భక్తుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. స్త్రీలు, వృద్దులు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. క్యూ లైన్లలో తొపులాటతో చిన్నపిల్లలు, వృద్ధులకు ఊపిరి ఆడటం కష్టమైంది. భక్తులను అదుపుచేయడానికి టీటీడీ భద్రతా సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.