తుది నివేదికను సిద్ధం చేస్తున్న మహిళల రక్షణ, భద్రత కమిటి

(అభినయ)

హైదరాబాద్, అక్టోబర్ 11: మ‌హిళల భ‌ద్రతపై తెలంగాణ ప్రభుత్వం నియ‌మించిన క‌మిటీ తుదినివేదికను ఇచ్చేందుకు క‌స‌ర‌త్తు చేస్తోంది. మ‌హిళ‌ల ర‌క్షణ కోసం దేశంలో రూపొందించిన చ‌ట్టాలు అమ‌లు తీరుతెన్నుల‌ను క‌మిటీ ప‌రిశీలిస్తోంది. విదేశాల్లో మ‌హిళ‌ల ర‌క్షణ కోసం చేప‌ట్టిన చ‌ర్యల‌ను ప‌రిశీలించేందుకు క‌మిటీ వ‌చ్చే నెల‌లో సింగ‌పూర్ ప‌ర్యట‌న‌కు వెళ్ళనుంది.

మ‌హిళ‌ల ర‌క్షణ‌, భ‌ద్రత అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ మేర‌కు వ్య‌వ‌సాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రట‌రీ పూనం మాల‌కొండ‌య్య నాయ‌క‌త్వంలో ఐఎఎస్, ఐపిఎస్ అధికారుల‌తో క‌మిటీని ఏర్పాటు చేసింది. ఈ క‌మిటీ ఇప్పటికే ప్రాథ‌మిక నివేదిక‌ను ప్రభుత్వానికి అంద‌జేసినన విషయం తెలిసిందే. తుది నివేదిక‌ను ఇవ్వడానికి మ‌రో నెల రోజులు క‌మిటీకి గ‌డువున్నప్పటికీ ఈ లోగానే ప్రభుత్వానికి తుది నివేదిక‌ను ఇవ్వాల‌ని క‌మిటీ భావిస్తోంది. ఈ మేర‌కు క‌మిటీ చ‌ర్యలు చేప‌ట్టింది. మ‌న దేశంలో మ‌హిళ‌ల ర‌క్షణ కోసం తయారు చేసిన చ‌ట్టాలు, అమ‌లౌతున్న తీరు తెన్నుల‌ను క‌మిటీ ప‌రిశీలిస్తోంది. అదే విధంగా వివిధ రాష్ట్రాల్లో అమ‌లౌతున్న ప‌థ‌కాల‌ను కూడ ప‌రిశీలించాల‌ని క‌మిటీ భావిస్తోంది. చ‌ట్టాల అమ‌లులో లోపాలు, మ‌హిళ‌ల‌ను హింసించిన నిందితులు త‌ప్పించుకోకుండా ఏ ర‌క‌మైన సిఫార‌సులు చేయాల‌నే దానిపై క‌మిటీ కేంద్రీక‌రించింది. ఈ విష‌య‌మై న్యాయ నిపుణుల‌తో క‌మిటీ చ‌ర్చించింది.

మ‌న దేశ ప‌రిస్థితుల‌కు అనుగుణంగా మెరుగైన సిఫార‌సులు చేయ‌డానికే క‌మిటీ మొగ్గుచూపుతోంది. ఎన్ని చ‌ట్టాలు చేసినా మ‌హిళ‌ల‌పై దాడులు త‌గ్గడం లేద‌నే విష‌యంపై కూడా క‌మిటీ ప‌రిశీలిస్తోంది. గ‌తంలోచోటుచేసుకొన్న సంఘ‌ట‌ల‌న‌ల్లో నిందితుల‌కు పడిన శిక్షలు అమ‌లులో లోపాలను కూడ క‌మిటీ క్షుణ్ణంగా అధ్యయ‌నం చేస్తోంది. భ‌విష్యత్తులో మ‌హిళ‌ల‌పై దాడులు, దౌర్జన్యాలు చోటు చేసుకోకుండా స్థానిక ప‌రిస్థితుల‌కు అనుగుణంగా కమిటి సిఫార‌సుల‌ను రూపొందించ‌నుంది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.