తెదేపా సభావేదిక దగ్ధం

tdp-ground-12

హన్మకొండ: వరంగల్ జిల్లా హన్మకొండలోని హయగ్రీవాచారి మైదానంలో తెలుగుదేశం పార్టీ నిర్వహించే సభా వేదికకు గురువారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. ఈ ఘటనలో సభావేదిక వెనుకభాగం దగ్ధమైంది. అక్కడున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మంటలను ఆర్పి పరిస్థితిని చక్కదిద్దేందు యత్నించారు. కార్యకర్తలు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారాన్ని అందించారు. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు.

ఈ మైదానంలో గురువారం తెలుగుదేశం నిర్వహించనున్న సభకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటామన్న ఎమ్మార్పీఎస్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. దీంతో ఎమ్మార్పీఎస్ కు చెందిన వారే ఈ దారుణానికి పాల్పడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.