తెదేపా సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం

హైదరాబాద్‌, నవంబర్‌ 3:  తెలుగు దేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో ఏర్పాటుచేసిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తోలి పేరును నమోదు చేసుకున్నారు. అనంతరం ముఖ్య నేతలు సభ్యత్వం స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ర్టాల్లో డిసెంబర్‌ 3 వరకు ఈ సభ్యత్వ నమోదు కొనసాగనుంది. టీడీపీ యువనేత నారా లోకేష్‌ సభ్యత్వ నమోదును పర్యవేక్షిస్తున్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.