తెలంగాణలో టీడీపీ తిరుగులేని విజయం సాధిస్తుంది: బాబు

chandrababu-naidu

తెలంగాణాలో టీడీపీ ఖాళీ అయిందని అంటున్నారని ఇతర పార్టీలు ఖాళీ అవుతాయే కాని టీడీపీ కాదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. తెలంగాణ ప్రాంతంలో టీడీపీ తిరుగులేని విజయం సాధిస్తుందని చెప్పారు. తెలంగాణ ప్రాంతంలో కొంత మంది నాయకులు పార్టీని వీడినా, కార్యకర్తలు మాత్రం పార్టీతోనే ఉన్నారని తెలిపారు. ఈ రోజు టీ.టీడీపీ నేతలతో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు ప్రసంగించారు. టీడీపీ పాలనలోనే తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలు అభివృద్ధి చెందాయని తెలిపారు. ఎన్నికలు సమీపిస్తున్నాయి. అన్ని విషయాలను సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని బాబు చెప్పారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.