తెలంగాణలో వైద్య విశ్వవిద్యాలయం ఏర్పాటు

హైదరాబాద్ : తెలంగాణకు ప్రధాన కేంద్రంగా ఉన్న వరంగల్ వైద్య విద్యకు కేంద్రంగా మారనుంది. వరంగల్‌లో విశ్వవిద్యాలయం ఏర్పాటుకు అవసరమయ్యే వనరులు, అనుమతులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపెట్టింది. తాజాగా విశ్వవిద్యాలయం మంజూరుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.  దీంతో రాష్ర్టానికి కొత్తగా ప్రత్యేక ఆరోగ్య విశ్వవిద్యాలయం ఏర్పాటుకానుంది. దీనికి విశ్వకవి కాళోజీ నారాయణరావు పేరిట వరంగల్ లో నెలకొల్పాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఇప్పటికే ఈ విశ్వవిద్యాలయానికి కాళోజీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌గా నామకరణం చేశారు.  2015-16విద్యా సంవత్సరానికి దీనిని అందుబాటులోకి తెచ్చేదిశగా ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి.

పిజి డెంటల్ సీట్ల భర్తీలో ఎస్టీ కోటాలో మొదటి కౌన్సిలింగ్ లో మొదటి ర్యాంకు సాధించిన తెలంగాణ విద్యార్ధినికి సీటు రాకపోవడంతో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని ఆమెకు న్యాయం చేసింది. ఇలాంటి అనుభవాలను దృష్టిలో ఉంచుకొని విద్యార్ధుల దీర్ఘ కాలిక ప్రయోజనాల దృష్ట్యా తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక ఆరోగ్య విశ్వవిద్యాలయం నెలకొల్పాలని ప్రభుత్వం సంకల్పించింది. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదముద్ర వేశారు. దీంతో ఎంబిబీఎస్ సీట్ల కేటాయింపు, కౌన్సిలింగ్‌లో విద్యార్థుల ఇబ్బందులు తొలగిపోనున్నాయి. రానున్న రోజుల్లో ఈ విశ్వవిద్యాలయం తెలంగాణకే తలమానికంగా మారనుంది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.