తెలంగాణా బిల్లు పై చర్చ ప్రారంభం, సభ వాయిదా

న్యూఢిల్లీ: లోక్‌సభ లో తీవ్ర గందరగోళం మధ్యలో హోం మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన బిల్లును పరిశీలించి ఆమోదించాలని స్పీకర్‌ మీరా కుమార్‌ ని కోరారు.

వాయిదా అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన లోక్‌సభలో 41వ అంశంగా తెలంగాణ బిల్లు వ్యవహారం వచ్చింది.

కీలకమైన బిల్లు పరిశీలనకు వచ్చిందని… ఈ సమయంలో సభలో శాంతియుత వాతావరణం ఉండాలని స్పీకర్‌ మీరా కుమార్‌ పదే పదే విజ్ఞప్తి చేసినా సభ్యులెవరూ వెనక్కి తగ్గకపోవడంతో… ఆమె సభను మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల వరకు వాయిదా వేశారు.

వాయిదా అనంతరం మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాలకు లోక్‌సభ తిరిగి ప్రారంభం అయింది. సుశీల్‌కుమార్‌ షిండే ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన బిల్లు పై ప్రసంగం మొదలు పెట్టగానే, సీమాంధ్ర సభ్యులు సమైఖ్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేస్తూ స్పీకర్‌ వెల్ లోకి వెళ్ళారు. తీవ్ర గందరగోళం నెలకొనటం తో స్పీకర్‌ మీరా కుమార్‌ మ. ౩ గంటల వరకు లోక్‌సభ వాయిదా వేశారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.