తెలంగాణ ప్రభుత్వమే ఎంసెట్ నిర్వహిస్తుంది

jagadish reddy-2

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి

హైదరాబాద్, జనవరి 2: తెలంగాణ ప్రభుత్వమే ఎంసెట్‌ను నిర్వహిస్తుందని విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. సచివాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశాల కొరకు గతంలో ఏ జీవోలైతే విడుదల చేయబడ్డాయో వాటినే అమలు చేస్తామని అన్నారు.  తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన విద్యార్థులు కూడా ఎంసెట్ రాసుకోవచ్చని ఆయన సూచించారు. ఇతర రాష్ట్రాల విద్యార్థులకు 15 శాతం ఓపెన్ కోటా వర్తింపజేస్తామని మంత్రి చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి ఇష్టానుసారంగా వ్యవహరిస్తుందని ఆయన ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌ కోరితే సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ముందుగా షెడ్యూల్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పొరపాటు చేసిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారమే నడుచుకుంటున్నామని మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటి వరకు అమలవుతున్న విధానాన్నే కొనసాగిస్తామని మంత్రి జగదీశ్వర్ రెడ్డి తెలిపారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.