తెలంగాణ ప్రభుత్వానికి ఇండియా టుడే అవార్డు

హైదరాబాద్, అక్టోబర్ 31: తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారకరామారావు మౌలిక వసతుల రంగంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇండియా టుడే అవార్డును శుక్రవారం అందుకున్నారు.

india today-ktr copy

అవార్డు అందుకుంటున్న తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారకరామారావు

ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రాలు ఎదిగినప్పుడే, అంత శక్తివంతంగా భారతదేశం కూడా తయారవుతుందని, కాబట్టి కేంద్రం అన్ని రాష్ట్రాలను సమదృష్టితో చూడాలని ఆయన కోరారు.  ప్రజల అంచనాలకు, ఆకాంక్షలకు అద్దంపట్టే విధంగా రాష్ట్రాలు వివిధ కార్యక్రమాలు రూపొందించుకొనే అవాకాశాన్ని, స్వేచ్ఛను కేంద్రం ఇవ్వాలని తద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నడిచినట్లయితే భారతదేశం కూడా అభివృద్ధిలో నడుస్తుందని కేటీఆర్ తెలిపారు. పెద్ద రాష్ట్రాల్లో అత్యుత్తమ మౌలిక వసతులు ఉన్న రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం కు అవార్డు దక్కడం ఆనందంగా ఉందన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.