పార్లమెంటులో తెలంగాణ బిల్లు – సుష్మా స్వరాజ్ డిమాండ్

హైదరాబాద్ రాజధానిగా 10 జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తూ పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలని  భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకురాలు సుష్మా స్వరాజ్ కాంగ్రెస్ ను డిమాండ్ చేశారు. డిసెంబరులో జరిగే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో బిల్లు పెట్టాలని, అదే విధంగా రాష్ట్రంలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని మహబూబ్ నగర్ జిల్లా పాలమూరులో  నిన్న నిర్వహించిన తెలంగాణ ప్రజా గర్జన సభలో ఆమె కోరారు. ఈ ప్రజా గర్జనకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. తెలంగాణ కోసం ఆత్మార్పణం చేసిన వారికి నివాళులు అర్పిస్తూ స్వరాజ్ తన ప్రసంగాన్ని తెలుగులో మొదలెట్టడం ప్రజలను ఆశ్చర్యపర్చింది. ఈ సందర్భంగా ఆమె మట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తప్ప సీమాంధ్రలో శాంతిభద్రతలు నెల కొంటాయని విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణ వస్తే హైదరాబాద్ లో ఉద్యోగాలు, భూములు  లాగేసుకుంటారనే భయాలు తలెత్తకూడదున. ప్రాంతాల మధ్య విభజనే తప్ప ప్రజల మధ్య విభజన రాకూడదన్నారు. ఎవరు కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయెద్దని ఆమె సూచించారు. సోదరుడు కోదండరాం అదే బాధ్యతతో ఇప్పటి వరకు ఉద్యమం నడిపించారన్నారు. తెలంగాణాకు మళ్లీ వస్తా `తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఆ విజయోత్సవాల్లో పాలు పంచుకునేందుకు లేదా కాంగ్రెస్ మరల మోసం చేస్తే రెండో దశ ఉద్యమాన్ని ప్రారంభించేందుకు వస్తా` అని సుష్మా స్వరాజ్ ప్రకటించారు.  కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, నేతలు విద్యాసాగర్ రావు, లక్ష్మణ్, నాగం జనార్ధన రెడ్డి, ఇంద్రసేనా రెడ్డి, బద్దం బాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.