తెలంగాణ వాటాను న్యాయబద్ధంగా తెచ్చుకుంటాం : హరీశ్ రావు

harish rao-3

హైదరాబాద్, జనవరి 3: బచావత్ ట్రిబ్యునల్ కు లోబడే తెలంగాణ ప్రభుత్వం నీటి కేటాయింపులు అడుగుతుంది తప్పా, ఒక్క నీటి చుక్క కూడా అదనంగా కోరుకోవడం లేదని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. సచివాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణకు న్యాయబద్ధంగా వచ్చే వాటాను వచ్చేదాక వదిలిపెట్టమని హరీశ్ రావు తెలిపారు.  ప్రభుత్వాలు రాజ్యాంగం ప్రకారం ఏ విధంగా నడుస్తున్నాయో, కృష్ణ నదీ నీటి జలాల పంపకాల విషయంలో కూడా బచావత్ ట్రిబ్యునలే తీర్పే ఇరు రాష్ట్రాలకు శిరోధార్యమన్నారు. తెలంగాణ రైతులను ఇబ్బందిపెట్టే పరిస్థితులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. అవసరం మేరకు వాడుకుని ఇప్పుడు తెలంగాణ ప్రజలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మోసం చేస్తోందని ఆయన మండిపడ్డారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కలిపి 811 టీఎంసీల నికరజలాలను బచావత్ ట్రిబ్యునల్ అవార్డు కేటాయించిందని తెలిపారు. ఇందులో 299 టీఎంసీలు తెలంగాణకు, 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ హక్కు కలిగి ఉన్నాయి. అయితే తుంగభద్రా నదిపై ఉన్నటువంటి ప్రాజెక్టు కేటాయింపులు, నాగార్జునసాగర్ దిగువఉన్న ప్రాజెక్టు కేటాయింపులు మినహాయిస్తే ప్రధానంగా కృష్ణానది ఇతర ఉపనదులపై వరకు ప్రాజెక్టుల కేటాంపులను అనుసరించి జూరాల మొదలు నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ వరకు ఉన్న కేటాయింపుల ప్రకారంగా తెలంగాణకు 200 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్ కు సుమారు 281 టీఎంసీలు హక్కు కలిగి ఉన్నాయి. 481 టీఎంసీలో బచావత్ ట్రిబ్యునల్ ప్రకారంగా ప్రాజెక్టుల వారీగా కేటాయించిన కేటాయింపుల ప్రకారంగా 200 తెలంగాణకు, 281 ఆంధ్రప్రదేశ్ కు రావాల్సి ఉందన్నారు. ఇప్పటి వరకు నాగార్జునసాగర్ వచ్చిన నీరు 481 టీఎంసీలకు అదనంగా మరో 137 టీఎంసీలు నాగార్జునసాగర్ లో వాడకానికి ఉన్నాయన్నారు. ఇందులో 68 టీఎంసీలు వరదలు, ఆవిరి వివిధ రకాలుగా నష్టం జరిగింది తీసివేయగా, మిగిలింది 550 టీఎంసీలు. ఈ 550 టీఎంసీలో తెలంగాణకు 229 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్ 321 టీఎంసీలు వాటాను కలిగి ఉన్నాయన్నారు.

ఇప్పటివరకు వాడుకుంది ఎంత

తెలంగాణకు 229 టీఎంసీల వాటా ఉన్నప్పటికీ అందులో 117 టీఎంసీలు మాత్రమే వాడుకుందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 321 టీఎంసీలు బదులు ఇప్పటివరకు 329 టీఎంసీలు వాడుకుంది. ఇప్పటికే 8 టీఎంసీలు అదనంగా వాడుకున్న ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఉన్న ఖరీఫ్ పంట పూర్తి కావడానికి మరో 41 టీఎంసీలు కావాలని, రాబోయే రబీ పంటకు 155 టీఎంసీలు కావాలని పట్టుపడుతుందన్నారు. కృష్ణా డెల్టాలో ఆంధ్రప్రదేశ్ వాటాకు కేటాయించిన 152.2 టీఎంసీల నీటికి బదులు 155 టీఎంసీలు నీటిని ఇప్పటికే వాడుకుంని, ఇంకా 26 టీఎంసీలు ఇస్తేనే గాని ఖరీఫ్ పంట పూర్తి కాదని ఇవ్వాలని పట్టుబడుతున్నారు. రైతు ఏ రాష్ట్రంలో ఉన్నా రైతే కాబట్టి మానవతా దృక్పదంతో అవసరమున్న 30 టీఎంసీలు ఇప్పుడు వాడుకొని తిరిగి ఖరీఫ్ లో లెక్కలో చూసుకుందాం అని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది. దానికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించలేదన్నారు.

ప్రాజెక్టుల కేటాయింపుల జోలికిపోకుండా ఇప్పటి వరకు జరిగిన నీటి వినియోగాల గురించి పట్టించుకోకుండా, ఇప్పుడు శ్రీశైలంలో, సాగర్ లో మిగిలిఉన్న 101 టీఎంసీలు మొత్తం మాకే కావాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిడివాదానికి దిగిందన్నారు. ఈ 101 టీఎంసీలే కాకుండా అవసరమైతే జలాశయాలను ఖాళీచేసి మరో 155 టీఎంసీలు విడుదల చేయాలనే మొండివాదనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుందన్నారు.

సమైఖ్య రాష్ట్రంలో నీటి దోపిడి ఇంతకాలం సాగింది, ఇప్పుడు మాత్రం జరగడానికి వీలు లేదన్నారు. నదీజలాల్లో ముఖ్యంగా కృష్ణా నదిలో బచావత్ ట్రిబ్యునల్ ప్రకారంగా తెలంగాణాకు రావల్సిన వాటా వచ్చేవరకు ప్రజల పక్షాన నిలబడతామన్నారు. చట్టపరంగా, న్యాయపరంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కృష్ణా నదిలో తెలంగాణ వచ్చే వాటాను దక్కించుకుంటామని మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.