దర్శకుడు తేజ చేస్తున్న ‘తప్పు’ !

ఒకప్పుడు చిన్న సినిమాలతో పెద్ద విజయాలు సాధించి బాక్సాఫీసు సంచలనాలు రేకెత్తించిన దర్శకుడు తేజ, గత కొంత కాలంగా విజయం అన్న మాటనే మరచిపోయాడు. ఇటీవలి కాలంలో ఆయన ఖాతాలో ఒక్క విజయం కూడా లేదు.
ఈ నేపథ్యంలో ఈ దర్శకుడు మరో చిన్న సినిమా ప్రారంభిస్తున్నాడు. ఈ చిత్రానికి ‘తప్పు’ అనే పేరు ఖరారు చేసినట్టు తాజా సమాచారం.
ఆమధ్య ఈయనతో ‘1000 అబద్ధాలు’ చిత్రాన్ని నిర్మించిన శ్రీ ప్రొడక్షన్స్ సంస్థే దీనిని కూడా నిర్మిస్తోంది.
ఇందులో నూతన నటీనటులు నటిస్తారు. ఇందుకోసం స్టార్ హంట్ కూడా నిర్వహిస్తున్నారు. దీనిని కూడా చిన్న బడ్జెట్టులో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

Have something to add? Share it in the comments

Your email address will not be published.