దసరాకే బిజేపి కొత్త కమిటి కూర్పు

హైదరాబాద్, సెప్టెంబర్ 22 : రాష్ట్రం  విడిపోయి తెలంగాణ రాష్ట్ర ఏర్పడినా ఇంకా బిజెపి లో మాత్రం  పాత కమిటినే కోనసాగుతోంది. ఇటీవలనే బిజేపి అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికైయ్యారు. ఆ వేంటనే కమిటి వేస్తారని పార్టీ నేతలందరూ భావించారు. కానీ అధ్యక్షుడు ఎన్నిక జరిగి రెండునెలలు కావొస్తున్నా, కొత్త కమిటి ఏర్పాటు చేయడంలో మాత్రం మీనమేషాలు లెక్కపెడుతున్నారంటూ పార్టీ కార్యక్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జాతీయ అధ్యక్షుడు అమిత్ షా  హైదరాబాద్ పర్యటన తరువాత ఆయన ఆమోదం తీసుకొని కమిటి వేయనున్నట్లు ప్రచారం జరిగింది. పార్టీ అంతర్గ సమావేశంలో మూడురోజుల్లో కొత్త కమిటి  వేయాలని అమిత్ షా ఆదేశించినప్పటికీ, అధ్యక్షుడు ఆదేశాలను అటకెక్కించారని పార్టీనేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెదక్ ఉపఎన్నిక పర్వం ముగియడంతో, ఇకనైనా కొత్త కమిటి వేస్తారో లేదోనని పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.

కొత్త కమిటీని నియమించడం అలస్యం అయిన మాట వాస్తవమేనని, ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత మరో పదిరోజుల్లో కమిటిని నియమించడం జరుగుతుందని కిషన్ రెడ్డి వివరణ ఇచ్చారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.