దిల్లీ శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

voters-7

పోలింగ్ కేంద్రం వద్ద బారుల తీరిన ఓటర్లు

దిల్లీ: దిల్లీ శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు దిల్లీ శాసనసభకు 673 మంది అభ్యర్ధులు ఎన్నికల బరిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఆమ్ ఆద్మీ ముఖ్యమంత్రి అభ్యర్ధి కేజ్రీవాల్ కొత్త దిల్లీ నియోజకవర్గం నుంచి, బిజేపి ముఖ్యమంత్రి అభ్యర్ధి కిరణ్ బేడీ కృష్ణా నగర్ నియోజకవర్గం నుంచి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్ధి అజయ్ మాకెన్ సదర్ బజార్ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. దిల్లీకి చెందిన 1,33,14,215 మంది ఓటర్లు నేతల భవితవ్యాన్ని నిర్ణయించబోతున్నారు. ఈ నెల 10న ఓట్ల లెక్కింపు జరగనుంది.

పోలింగ్ సందర్భంగా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. దిల్లీ శాసనసభ ఎన్నికల కోసం ఎన్నికల కమీషన్ మొత్తం 12177 పోలింగ్ బూతులను ఏర్పాటు చేసింది. వీటిలో 714 పోలింగ్ బూత్ లు సమస్యాత్మక ప్రాంతాల్లో ఉన్నాయి. సమస్యాత్మక ప్రాంతాల్లో ఎన్నికల కమీషన్ అదనపు బలగాలను మోహరించింది. దిల్లీ పోలీసు విభాగానికి చెందిన 80 వేల జవాన్లకు తోడు కేంద్ర బలగాలకు చెందిన 123 టీంలను ఎన్నికల సందర్భంగా బందోబస్తును నిర్వహిస్తున్నాయి.

Have something to add? Share it in the comments

Your email address will not be published.