దీన్ దయాళ్ కాలనీలో పేదలకు ఇళ్ల పట్టాలిస్తాం : కేసీఆర్

 

వరంగల్, జనవరి 9: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా రెండో రోజు నగరంలోని దీన్ దయాళ్ కాలనీలో శుక్రవారం పర్యటించారు. కాలనీలో తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. మహిళతో మాట్లాడి వారి సమస్యల గురించి అడిగి తెలుసుకుంటున్నారు. వారి మధ్యే కూర్చొని మాట్లాడుతున్నారు. ఎక్కడికక్కడ సమస్యలకు పరిష్కారం తెలుసుకుంటూ ఆ పనులు చేస్తామని హామీనిస్తున్నారు.

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ఐదు నెలల్లో దీన్ దయాళ్ కాలనీ స్వరూపమే మారిపోతుందన్నారు. దీనికి ప్రజలందరూ సహకరించాలని కోరారు. కాలనీ ప్రజలందరూ శనివారం సెలవు పెట్టి ఇళ్లల్లోనే ఉండాలని సూచించారు. అధికారులు వచ్చి అందరి వివరాలు నమోదు చేస్తారని, ఉన్న వారందరికి ఇళ్ల పట్టాలు అందిస్తామని ప్రకటించారు. రేషన్ కార్డులు లేనివారికి కార్డులు మంజూరు చేస్తామని కేసీఆర్ అన్నారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి రాజయ్య, వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి, తదితరులు పాల్గొన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.