దేశ రాజధానిలో జర్మనీ మహిళపై గ్యాంగ్ రేప్

Delhi-gang-rape

ఢిల్లీలో నిర్భయ ఉదంతాలు కొనసాగుతూనే ఉన్నాయి. అబలలపై అత్యాచారాలకు అడ్డుకట్ట పడడం లేదు. తాజాగా 51ఏళ్ల జర్మనీ మహిళపై రైల్వే స్టేషన్ సమీపంలో కామ పిశాచాలు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాయి. నిన్న రాత్రి ఇది జరిగింది. అయితే పోలీసులు వైద్య పరీక్షలకు వెళ్లాలని కోరినా సదరు మహిళ తిరస్కరించి ఈ ఉదయం కోపెన్ హెగెన్ కు వెళ్లిపోయారు. అత్యాచారం చేసిన తర్వాత తన దగ్గరున్న డబ్బులు, ఇతర విలువైన వస్తువులను కూడా దోచుకున్నారని ఆమె పోలీసులకు తెలిపారు.

భారత సందర్శనకు వారం క్రితం వచ్చిన సదరు మహిళ ముందుగా ఆగ్రా వెళ్లి అనంతరం ఢిల్లీకి చేరుకున్నారు. మంగళవారం ఢిల్లీలోని నేషనల్ మ్యూజియంకు వెళ్లి తిరిగి రాత్రి హోటల్ కు వెళుతుండగా దారి తప్పిపోయారు. దారిలో కనిపించిన వారిని అడ్రస్ గురించి అడగగా కొందరు యువకులు దారి చూపుతామని రైల్వే స్టేషన్ సమీపంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. తనపై అత్యాచారం చేసింది వీధి నివాసితులుగా ఆమె పేర్కొంది. ఆమె చెప్పిన వివరాల ప్రకారం పోలీసులు ఆరుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.