నందిగామలో తెదపా అభ్యర్ధిని తంగిరాల శ్వేత ఘన విజయం

నందిగామ : కృష్ణాజిల్లా నందిగామ శాసనసభ ఉపఎన్నికలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని తంగిరాల సౌమ్య ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి బోడపాటి బాబూరావుపై ఆమె 74,827 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అంతకుముందు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున విజయం సాధించిన తంగిరాల ప్రభాకరరావు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయకముందే మృతిచెందడంతో ఉప ఎన్నిక నిర్వహించారు.
స్థానిక కేవీఆర్ కళాశాలో మొత్తం 15 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తిచేశారు. టిడీపి అభ్యర్థిని తంగిరాల సౌమ్యకు 99,748 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి బాబూరావుకు 24,921 ఓట్లు మాత్రమే వచ్చాయి. బరిలో ఉన్న స్వతంత్ర అభ్యర్ధులు పుల్లయ్యకు 941, పుల్లారావుకు 647 ఓట్లు వచ్చాయి.  విజయం సాధించిన సౌమ్యకు ఎన్నిక దృవీకరణ పత్రాన్ని రిటర్నింగ్ అధికారి అందజేశారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.