నందిగామ, మెదక్ ఉప ఎన్నికల్లో తెదేపా, తెరాస అభ్యర్ధుల విజయం

నందిగామలో తెదపా అభ్యర్ధిని తంగిరాల శ్వేత ఘన విజయం

కృష్ణాజిల్లా నందిగామ శాసనసభ ఉపఎన్నికలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని తంగిరాల సౌమ్య ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి బోడపాటి బాబూరావుపై ఆమె 74,827 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అంతకుముందు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున విజయం సాధించిన తంగిరాల ప్రభాకరరావు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయకముందే మృతిచెందడంతో ఉప ఎన్నిక నిర్వహించారు.
స్థానిక కేవీఆర్ కళాశాలో మొత్తం 15 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తిచేశారు. టిడీపి అభ్యర్థిని తంగిరాల సౌమ్యకు 99,748 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి బాబూరావుకు 24,921 ఓట్లు మాత్రమే వచ్చాయి. బరిలో ఉన్న స్వతంత్ర అభ్యర్ధులు పుల్లయ్యకు 941, పుల్లారావుకు 647 ఓట్లు వచ్చాయి.  విజయం సాధించిన సౌమ్యకు ఎన్నిక దృవీకరణ పత్రాన్ని రిటర్నింగ్ అధికారి అందజేశారు. అనంతరం ఆమె మీడియా తో మాట్లడుతూ ఈ విజయాన్ని తన తండ్రి తంగిరాల ప్రభాకరావుకు ప్రజలు ఇచ్చిన నివాళిగా భావిస్తానిని చెప్పారు. జిల్లాలో అందరి సహకారంతోనే ఇంత భారీ మెజారిటీ సాధ్యమైంది అని ఆమె చెప్పారు. గెలుపుకు కృషిచేసిన వారందరికి తంగిరాల సౌమ్య కృతజ్ఞతలు తెలిపారు.

 

మెదక్ లోక్ సభ స్థానం తెరాస కైవసం

మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికలో పోలింగ్ శాతం తగ్గినా,  ప్రత్యర్థుల మీద ఆ పార్టీ తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించింది. మెదక్ లోక్ సభ ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్ధి కొత్త ప్రభాకర్ రెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధించారు. 3,61,277 ఓట్ల మెజారిటీతో ఆయన కాంగ్రెస్ అభ్యర్ధిని మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డిపై గెలుపొందారు. మెదక్ లోక్‌సభ పరిధిలోని 7 సెగ్మెంట్లలో టీఆర్‌ఎస్ అత్యధిక చోటుచేసుకుంది. నర్సాపూర్, సిద్ధిపేట, మెదక్, పటాన్‌చెరు, దుబ్బాక సెగ్మెంట్లలో టీఆర్‌ఎస్ మొదటి స్థానంలో నిలవగా, రెండు, మూడు స్థానాల్లో కాంగ్రెస్, భాజాపా నిలిచింది. జగ్గారెడ్డికి పట్టున్న సంగారెడ్డిలో, టీడీపీకి బలమున్న గజ్వేల్ సెగ్మెంట్లలో బీజేపీ రెండో స్థానానికి పరిమితమైంది. కాంగ్రెస్, భాజాపా అభ్యర్థులు ఓటమి పాలైనప్పటికీ డిపాజిట్లు రావడంతో పరువు దక్కినట్లయింది. మొత్తం 10,46,080 ఓట్లు పోలవ్వగా అందులో తెలంగాణ రాష్ట్ర సమితికు 5,71,800, కాంగ్రెస్ కు 2,10,523, భారతీయ జనతా పార్టీకు 1,86,334 ఓట్లు లభించాయి.

Have something to add? Share it in the comments

Your email address will not be published.