నకిలీ జీవోలతో మోసం, ఆరుగురు నిందితుల అరెస్ట్

ccs-20

హైదరాబాద్, డిసెంబర్ 20: నకిలీ జీవోలతో నిరుద్యోగులను మోసం చేసిన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ వ్యవహారానికి సంబంధిన కేసులో మొత్తం 6 గురిని సిసిఎస్ పోలీసులు అరెస్టు చేశారు. వీళ్లు గత 8 నెలల నుంచి సచివాలయంలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నకిలీ జీవోను చూపించి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారు. ఇప్పటికే చాలా మంది నిరుద్యోగుల నుంచి భారీ మొత్తంలో వసూలు చేసినట్లుగా అధికారులు చెబుతున్నారు. దీంతో పాటుగా సచివాలయంలోని డి బ్లాక్ లో ప్రత్యేకంగా అభ్యర్దులకు ఇంటర్యూలు కూడా నిర్వహించారు. ఒక్కొక్క అభ్యర్ధి నుంచి 4 నుంచి 6 లక్షల రూపాయలు వసూలు చేశారు.

రోజులు గడిచిపోతున్నా ఉద్యోగాలు రాకపోవడంతో డబ్బుకట్టిన వాళ్లల్లో మనుసూర్ అనే వ్యక్తికి అనుమానం రావడంతో, అతను సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదుచేశాడు. వారు అందించిన ఆధారాలతో జీవో నకిలీదని తేలడంతో ఈ మొత్తం వ్యవహారం బయటపడింది. బాధితుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన సిసిఎస్ పోలీసులు నకిలీ జీవో లపై సంబంధం ఉన్న ఆరుగురి బ్రోకర్లను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. నకిలీ జీవోలు ఎవరు సృష్టించారు, ఎలా సృష్టించారు, వీటి వెనుక ఎవరైనా అధికారులు ఉన్నారా అనే వాటిపై కూపీ లాగుతున్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.