నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

road accident-30

రోడ్డు ప్రమాదంలో నుజ్జు నుజ్జు అయిన కారు

నల్గొండ, డిసెంబర్ 30: నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లి వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ కారుని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 5 గురు వాడపల్లి వాసులు అక్కడికక్కడే మృతి చెందారు. లారీ రాంగ్ రూట్ లో వచ్చి కారుని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. వాడపల్లికి చెందిన ఖలీం, రిజ్వానా, ఫరానా, విజయ్, సైదయ్య మృతిచెందగా ఓ చిన్నారి తీవ్రంగా గాయపడింది. ప్రమాదంలో గాయపడిన చిన్నారిని హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన టాటా ఇండికా కారు నుజ్జు నుజ్జు అయింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.