నల్ల కుబేరుల పేర్లను తక్షణం వెల్లడించండి

supre court 1న్యూ ఢిల్లీ, అక్టోబర్‌ 28: నల్ల ధనం కేసులో అందరి పేర్ల జాబితాను కేంద్ర ప్రభుత్వం బుధవారం సుప్రీం కోర్టుకు సమర్పించనుంది. ఈ కేసులో కేంద్రం వైఖరిపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. విదేశాలో డబ్బు దాచినవారిని ఎందుకు కాపాడతారు? అని ప్రశ్నించింది. పేర్లు ఇవ్వండి, తదుపరి ఆదేశాలు తాము జారీ చేస్తామని కోర్టు తెలిపింది. నల్ల ధనాన్ని వెనుకకు తెచ్చే వ్యవహారాన్ని ప్రభుత్వానికి వదిలిపెట్టలేమని కోర్టు స్పష్టం చేసింది. విదేశాలలో బ్యాంకు ఖాతాలు ఉన్నవారి ప్రయోజనాలను కేంద్రం కాపాడవలసిన అవసరంలేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. గత ఆదేశాలను సవరించాలన్న కేంద్రం తీరుపై న్యాయస్థానం మండిపడింది. కొత్త ప్రభుత్వం మార్పులు చేయమనడం సరికాదంది. ఉత్తర్వులలో ఒక్క పదాన్ని కూడా మార్చం అని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.