నాలుగు నెలల్లో జగన్ జైలుకే: కోడెల

kodela-shiva-prasad

టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ వైఎస్సార్ సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పై తీవ్ర విమర్శలు చేశారు. రెండో ప్లీనరీ సమావేశాల్లో జగన్ తన ప్రసంగంలో నాలుగు నెలల్లో నేను ముఖ్యమంత్రి కావడం ఖాయమని అన్నారు. దీనికి కోడెల శివప్రసాద్ సమాధానమిస్తూ … నాలుగు నెలల్లో జగన్ ముఖ్యమంత్రి అవడం కాకుండా అదే నాలుగు నెలల్లో జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. సీబీఐ కేసులో జగన్ ఏ1 ముద్దాయిగా ఎందుకు ఉన్నారో ప్రజలకు తెలియాలని ఎన్టీఆర్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో  కోడెల చెప్పారు. ప్రజల్లో జగన్ బలహీనపడుతున్నందునే కేంద్రం సీఎం కిరణ్ ను తెరమీదకు తెచ్చి నాటకం ఆడుతోందని కోడెల ఆరోపించారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.