నిజాం గొప్ప ప్రభువు : కేసీఆర్

kcr-exibition-1

నుమాయిష్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్

హైదరాబాద్, జనవరి 1: ఉస్మానియా, గాంధీ, నీలోఫర్ వంటి ప్రభుత్వ ఆసుపత్రులను నిర్మించిన నిజాం గొప్ప ప్రభువని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కోనియాడారు. నాంపల్లిలో 75వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనను (నుమాయిష్) కేసీఆర్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ లో నిర్మించిన రైల్వే స్టేషన్, ప్రభుత్వ ఆసుపత్రులు నిజాం ప్రభుత్వ హయాంలోనే నెలకొల్పబడ్డాయన్నారు. నిజాం హయాంలో కట్టించిన ప్రభుత్వ ఆసుపత్రులే తప్ప ఇప్పటివరకు కొత్తవి రాలేదన్నారు. ప్రైవేటు ఆసుపత్రులు ఎన్ని ఉన్నప్పటికీ ప్రభుత్వ ఆసుపత్రులు కట్టించిన ఘనత నిజాంకే దక్కుతుందన్నారు. రాజ్యం పోయిన తరువాత రాజుగా లేనప్పటికీ నిజాం ఇచ్చిన స్థలం, డబ్బుతోనే నిజాం ఆర్థోపెడిక్ ఆసుపత్రిని కట్టించారన్నారు. నిజాంను పొగిడినందుకు తనపై అనేక విమర్శలు చేశారన్నారు. ఇంతటి చరిత్ర ఉన్న నిజాంను స్మరించుకుంటే తప్పేంటని కేసీఆర్ ప్రశ్నించారు.

హైదరాబాద్ లో ప్రతీ ఏడాదీ 10 లక్షల జనాభా పెరుగుతందని, నగరంలో అన్ని మతాల, కులాల వాళ్లు ఉన్నారని తెలిపారు. పెరుగుతున్న జనాభాకి తగినట్లుగా నగరంలో సౌకర్యాలు పేరగలేదన్నారు. దేశ విదేశాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలనుంచి ఇక్కడకు వచ్చి స్థిరపడ్డ వాళ్లు ఎంతో మంది ఉన్నారన్నారు. అంతేకాకుండా నగరంలో గుజరాతీ గల్లీ, ఇరానీ గల్లీ లాంటి ఎన్నో పరప్రాంతాల పేరుతో వాడలున్నాయన్నారు. నగరానికి ఎవరొచ్చినా సరే అక్కున చేర్చుకుంటుందని తెలిపారు.

హైదరాబాద్ లో భయంకరమైన ట్రాఫిక్ సమస్య ఉందన్నారు. ట్రాఫిక్ పోలీసులు ఉండనటువంటి చౌరస్తాలు హైదరాబాద్ లో రావాలని దీనికి అందరూ సహకరించాలని కేసీఆర్ కోరారు. అదేవిధంగా ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి తన వద్ద ప్రణాళిక ఉందని, దీనికోసం జంటనగరాల ప్రజలతో ముఖ్యమంత్రి ముఖాముఖి అనే టీవీ కార్యక్రమం త్వరలో ఏర్పాటుచేసి, తద్వారా ప్రజల నుంచి వచ్చే సలహాలను పరిగణలోకి తీసుకొని, అందరి సహకారంతో ముందుకెళ్తామన్నారు. హైదరాబాద్ నగరాభివృద్ధికి అందరి సలహాలను, సూచనలను పరిగణలోకి తీసుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.



  • rajanala BK says:

    British rulers developed railways…ports..roads
    ..and many more infrastructure projects.. Even Chandra Babu..did something good for Telangana in general and Hyd. In particular..can we admire them too…stupidity