నితిన్ తో నందిని రెడ్డి సినిమా

‘అలా మొదలైంది’ సినిమాతో దర్శకురాలిగా పరిచయమైన నందిని రెడ్డి, తన రెండో సినిమా ‘జబర్దస్త్’ ఫ్లాపవడంతో కాస్త గ్యాప్ తీసుకుని ఇప్పుడు మరో కథతో సిద్ధమైంది. ఇందులో యంగ్ హీరో నితిన్ కథానాయకుడుగా నటిస్తాడు. ‘అలా మొదలైంది’ చిత్ర నిర్మాత దామోదర ప్రసాద్ దీనిని నిర్మిస్తాడు. నందిని చెప్పిన కథకు నితిన్ ఓకే చెప్పినట్టు సమాచారం. ప్రస్తుతం నితిన్ నటించిన ‘హార్ట్ ఎటాక్’ సినిమా విడుదలకు రెడీ అయింది. దీని తర్వాత ‘కొరియర్ బాయ్ కల్యాణ్’ వస్తుంది. ఆ తర్వాత కరుణాకరన్ దర్శకత్వంలో  రూపొందే సినిమాలో నితిన్ నటిస్తాడు. అదే సమయంలో నందిని రెడ్డి ప్రాజక్టు కూడా చేస్తాడట.

Have something to add? Share it in the comments

Your email address will not be published.