నిర్ణయాలు తీసుకునేది ప్రజలే

నిర్ణయాలు తీసుకునేది ప్రజలే

హైదరాబాద్ : ప్రజాస్వామ్యంలో నిర్ణయాలు తీసుకునేది ప్రజలే కాని పార్టీలు కాదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నర్మగర్భంగా కేంద్రానికి పరోక్ష హెచ్చరికలు చేశారు. తెలుగుభాషా దినోత్సవం సందర్భంగా రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి ీ మాటలు చెప్పారు. సరైన నిర్ణయాలు తీసుకోకపోతే ప్రజలు సాగనంపుతారన్నారు. రాష్ట్రవిభజనపై కాంగ్రేస్ వర్కింగ్ కమిటి నిర్ణయం తీసుకుని నెలరోజులు గడిచిపోయిన తర్వాత ముఖ్యమంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనం కలిగించాయి. రాష్ట్రవిభజన ఒక సున్నితమైన అంశమని, సరయిన సమయంలో సరయిన విధంగా ముందుకు వస్తామని చెప్పారు. తెలుగు ప్రజల ఆకాంక్షలకు, అభిలాషలకు, అభివృద్ధికి అనుగుణంగా అవసరమైతే కఠిన నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.