“నిర్భయ” అపరాధి ఆత్మహత్యాయత్నం

దిల్లీ:  నిర్భయ కేసులో నేరస్థుడిగా రుజువై  ప్రస్తుతం నేరస్థుడిగా జైలుశిక్ష అనుభవిస్తున్న వినయ్ శర్మ ఆత్మహత్యాయత్నం చేశాడు. 2012లో మేడిసన్ చదువుతున్న నిర్భయ అనే యువతిని గ్యాంగ్ రేప్ చేసిన సంఘటనలో దోషిగా తేలిన వినయ్ ప్రస్తుతం తిహార్ జైల్లో మరణశిక్ష అనుభవిస్తున్నాడు.

బుధవారం రాత్రి టవల్ తో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు ఏవో మాత్రలు మింగినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయాన్ని గమనించిన జైలు సిబ్బంది వెంటనే దీనదయాళ్ ఆసుపత్రికి తరలించడంతో అతని ఆరోగ్యానికి ఎటువంటి ప్రమాదం లేదని సమాచారం. వినయ్ శర్మ గత ఏడాది తనమీద సహఖైదీలు దాడి చేస్తున్నారని, తనకు మరింత రక్షణ కావాలని అధికారులని కోరాడు.

2012 డిసెంబర్‌లో దేశరాజధానిలో జరిగిన నిర్భయ ఉదంతం దేశవ్యాప్తంగా పెను సంచలనం అయింది. ఈ ఘటనలో వినయ్‌ శర్మ సహా మరో ఆరుగురు వ్యక్తులను న్యాయస్థానం దోషులుగా నిర్ధారించి వీరికి మరణశిక్ష విధించింది. ప్రస్తుతం వీరు తిహార్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఇదే కేసులో మరో నేరస్థుడు రామ్ సింగ్ కూడా 2013లో  జైల్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా.. వీరిలో ఒకరు మైనర్‌ అని రుజవవడంతో అతన్ని విడుదల చేశారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.