నిర్వాసితులకు ఎలాంటి అన్యాయం జరగదు : దేవినేని

devinei uma1-30

పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ కు చిరకాల స్వప్నం. ఏళ్ల తరబడిగా పెండింగులో ఉన్న ఈ ప్రాజెక్టును నాలుగేళ్లలో పూర్తిచేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పోలవరం పూర్తయితే రాష్ట్రంలో సాగు, తాగు నీటి సమస్యలు తీరిపోతాయని ప్రభుత్వం భావస్తుంది. పోలవరానికి ఉన్న అడ్డంకులన్నీ దాదాపుగా తొలగిపోవడంతో నిర్మాణ పనులపై ప్రభుత్వం దృష్టి సారించింది. మంత్రులు దేవినేని ఉమ, పీతల సుజాతతోపాటుగా ఇరిగేషన్ అధికారులు పోలవరం ప్రాజెక్టును పరిశీలించారు. వీలైనంత త్వరగా పనులను వేగవంతంచేసి పూర్తిచేయాలని ఆదేశించారు. ప్రాజెక్టు పనులపై ప్రతినెలా సమీక్ష నిర్వహించనున్నట్లు దేవినేని ఉమ తెలిపారు. కేంద్రం నుంచి మరిన్ని నిధులు రాబట్టేందుకు ప్రత్నిస్తామని ఆయన తెలిపారు.

devinei uma2-30

ఖమ్మం జిల్లాలనుంచి విలీనమైన మండలాల ప్రజల సమస్యలను పట్టించుకోవాలని, పోలవరం పనులను పరిశీలించేందుకు వచ్చిన మంత్రులకు తమ గోడును వెళ్లబోసుకున్నారు. ప్రాజెక్టు పూర్తవడానికి నాలుగేళ్ల పట్టె అవకాశం ఉండటంతో లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కాల్వల్లోకి నీరు తరలించే ఏర్పాటుచేస్తామని మంత్రి దేవినేని పేర్కొన్నారు. నిర్వాసితులకు ఎలాంటి అన్యాయం జరుగకుండా చూస్తామని మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు హామి ఇచ్చారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.