నేడు కేసీఆర్ విజయోత్సవ ర్యాలీ

“ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున ఢిల్లీ వెళ్తున్నా… తెలంగాణ రాష్ట్రం తరపునే తిరిగొస్తా” అని చెప్పి వెళ్లిన కేసీఆర్… అన్నట్టుగానే తెలంగాణ సాధించి ఈ రోజు హైదరాబాద్ తిరిగి వస్తున్నారు. దీంతో ఆయనకు భారీ ఎత్తున స్వాగతం పలికేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

విమానం ఆలస్యం కారణంగా కేసీఆర్ విజయోత్సవ ర్యాలీ సమయంలో మార్పులు చోటు చేసుకున్నాయి. సాయంత్రం 4 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి స్వాగత ర్యాలీ ప్రారంభమవుతుందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. ఇక్కడ ఆయనకు వేయి మంది బ్రాహ్మణులు పూర్ణకుంభ స్వాగతం పలుకుతారు.

అనంతరం విజయరథంపై ఊరేగింపుగా గన్ పార్కులోని అమరవీరుల స్థూపం వద్దకు బయలుదేరుతారు. అక్కడ 1969లో మరణించిన అమరవీరులకు నివాళులు అర్పిస్తారు. బేగంపేట నుంచి గన్ పార్కుకు చేరుకునే సమయంలో హెలికాప్టర్ తో పూల వర్షం కురిపిస్తారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.