నేడు తిరుమల శ్రీవారికి గరుడసేవ

తిరుమల : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి గరుడసేవ జరగనుంది. స్వామివారి ప్రధాన వాహనమైన గరుత్మంతుడికి శ్రీవారి ఉత్సవాల్లో అత్యంత ప్రాధాన్యముంది. గరుడోత్సవానికి టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శ్రీవారి ఆలయం చుట్టూ మూడంచెల భద్రతతోపాటు మాడవీధుల్లో బారిగేడ్లు, గ్యాలరీలు ఏర్పాటు చేశారు. తిరుమల ఘాట్‌రోడ్లలో అక్టోబర్ 1వ తేదీ వరకూ ద్విచక్ర వాహనాలను నిలిపివేశారు. భద్రతను కూడా పటిష్టం చేశారు. గరుడసేవకు దాదాపు 5లక్షల మంది భక్తులు హాజరవుతారని అధికారుల అంచనా. తిరుపతి అలిపిరి, శ్రీవారి మెట్టు ప్రవేశ మార్గాల వద్ద  పార్కింగ్‌ స్థలాన్ని ఏర్పాటుచేశారు. దాదాపు 5వేల మంది పోలీసులతో గరుడోత్సవానికి భద్రత కల్పిస్తున్నారు.  సాయంత్రం నాలుగు గంటల నుంచి భక్తులను గ్యాలరీల్లోకి అనుమతించనున్నారు.  గరుడసేవ సందర్భంగా తరలి వచ్చే భక్తులకు శ్రీవారి నిత్యాన్నప్రసాద సముదాయం, క్యూ కాంప్లెక్స్‌లు, క్యూలు, నాలుగు మాడ వీధుల్లో సుమారు రెండు లక్షల మందికి అన్నదానంతో పాటు మంచినీరు ఏర్పాటు చేశారు. భక్తులకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు తిరుమలలో పలు ప్రాంతాల్లో వైద్య శిభిరాలు ఏర్పాటు చేశారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.