నేడు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్

 

telangana assembly-11f

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. గత ఏడాది అంచనాలతో ప్రవేశపెట్టిన బడ్జెట్ వాస్తవాల ఆధారంగా పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యాలను దృష్టిలో ఉంచుకొని సమీప భవిష్యత్తులో ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను ఈ బడ్జెట్ లో ప్రతిబింబించనుంది.

తెలంగాణ రాష్ట్రం తొలిసారిగా పూర్తిస్థాయి బడ్జెట్ ను బుధవారం శాసనసభలో ప్రవేశపెట్టనుంది. ఈ దఫా కూడ లక్ష కోట్లను బడ్జెట్ దాటే అవకాశం ఉంది. ఒక లక్ష 10 వేల 535 కోట్లతో బడ్జెట్ ను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం. ఇందులో ప్లాన్ కింద 48 వేల కోట్లు, నాన్ ప్లాన్ కింద 62 వేల కోట్లను ప్రతిపాదించే అవకాశం ఉంది. గత ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే నిధుల ఆధారంగా బడ్జెట్ ప్రతిపాదనలను ప్రభుత్వం రూపొందించింది. దీంతో పాటుగా అంచనాల ఆధారంగానే ఈ బడ్జెట్ ను ప్రభుత్వం రూపొందించింది. అయితే తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ లో వాస్తవ అంచనాల మేరకే ప్రతిపాదించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన పథకాలు, ఆ మేరకు రాష్ట్రంలో ప్రత్యామ్నాయ మార్గాల్లో నిధుల సమీకరణ, రాష్ట్ర అవసరాల మేరకు బడ్జెట్ లో మార్పులు చేర్పులకు ప్రభుత్వం బడ్జెట్ ను ప్రతిపాదించనుంది.

సంక్షేమ పథకాలకు ప్రభుత్వం బడ్జెట్ లో పెద్దపీట వేయాలని నిర్ణయించింది. ఆసరా పథకం పేరుతో పెద్ద ఎత్తున పింఛన్ల పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. రాష్ట్రంలో సుమారు 29 లక్షలకు పైగా పింఛన్లను ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. సంక్షేమ పథకాలతో పాటుగా మిషన్ కాకతీయ, హారితహారం, వాటర్ గ్రిడ్ తదితర పథకాలకు కూడ ప్రభుత్వం బడ్జెట్ లో పెద్ద ఎత్తున నిధులను కేటాయించనుంది. రైతులకు రుణమాఫీ కోసం 12,750 కోట్లు, వాటర్ గ్రిడ్ కోసం 40 వేల కోట్లు, మిషన్ కాకతీయకు సుమారు 25 వేల కోట్లను ఈ బడ్జెట్ లో ప్రభుత్వం కేటాయించనుంది. డబుల్ బెడ్ రూమ్ పథకం కేజీ టూ పీజీ పథకం కింద కూడ పెద్ద ఎత్తున నిధులను కేటాయించనుంది సర్కార్.

ఈ రోజు ఉదయం 10 గంటలకు శాసనసభలో ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. అదే విధంగా శాసనమండలిలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.