నేడు ప్రపంచ జల దినోత్సవం (వరల్డ్ వాటర్ డే)

World Water day

మనం ప్రతీ సంవత్సరము పండుగలు మరియు ఉత్సవాలు జరుపుకుంటుంటాము. మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందంగా జీవితం గడపడానికే ఉత్సవాలు జరుపుకుంటాము. సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూ ఉంటాం. సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము. ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాళి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది.
అదేవిధంగా ప్రతి సంవత్సరము మార్చి 22వ తేదిన ప్రపంచ జల దినోత్సవం (వరల్డ్ వాటర్ డే) నిర్వహించాలని ఐక్యరాజ్యసమితి తీర్మానించింది.
ప్రపంచ జల దినోత్సవాన్ని అంతర్జాతీయంగా పాటించాలన్న ఆలోచన, “పర్యావరణం, ప్రగతి అనే అంశాలపై 1992 లో రియో డి జెనేరోలో జరిగిన ఐక్యరాజ్యసమితి మహాసభ”లో రూపుదిద్దుకుంది.
మనం నివసించే భూగోళంలో 70 శాతానికి పైగా నీరే. అయితే, అందులో పరిశుభ్రమైన నీరు చాలా కొద్ది భాగం మాత్రమే. మొత్తం భూగోళంలోని నీటిలో దాదాపు 2.7 శాతం మాత్రమే శుభ్రమైన నీరు కాగా, ఇందులోనూ 75.2% ధృవ ప్రాంతాల్లో మంచు రూపంలో ఘనీభవించి వుంటే, మరో 22.6% నీరు భూగర్భంలో ఉంది. మిగతా నీరు సరస్సులు, నదులు, వాతావరణం, గాలిలోని తేమ, చెట్టు చేమలలో వుంటుంది. అంతేకాదు నదులు, సరస్సులలో, భూగర్భ జలాలలో కూడా మానవ వినియోగానికి, ఇతర అవసరాలకు చక్కగా ఉపయోగపడే నీరు చాలా కొద్ది పరిమాణం మాత్రమే.

ప్రపంచం మొత్తంలో లభ్యమయ్యే పరిశుభ్రమయ్యే నీటిలో 1% కంటే కూడా తక్కువ పరిమాణంలో నీరు మానవ వినియోగానికి నేరుగా ఉపయోగపడుతుంది. ప్రతిరోజు మనకు కనీసం 30-50 లీటర్ల పరిశుభ్రమైన, సురక్షితమైన అవసరం. కానీ ఇప్పటికీ 88.4 కోట్ల మంది ప్రజలకు సురక్షితమైన నీరు అందుబాటులో లేదు.
కాబట్టి మనమందరం ప్రతీ నీటి బొట్టును జాగ్రత్తగా కాపాడుకుంటూ, భవిష్యత్ తరాలకు నీటి కష్టాలు లేకుండా ఎంతో కొంత మనవంతు ప్రయత్నాన్ని చేద్దాం.

Have something to add? Share it in the comments

Your email address will not be published.