నేడు మెదక్ , నందిగామ ఉపఎన్నికల పోలింగ్

నేడు మెదక్ , నందిగామ ఉపఎన్నికల పోలింగ్

ఫలితాలు 16న

హైదరాబాద్, సెస్టెంబర్ 13: మెదక్ లోక్ సభ ఉపఎన్నికల ప్రచారం మునుపెన్నడు జరగని రీతిలో జరిగింది. ఈ ప్రచారం తీవ్రత మెదక్ ఉపఎన్నిక ప్రాధాన్యాన్ని చాటుతోంది.  ప్రథనాంగా మెదక్ లోక్ సభ నియోజకవర్గంలో ఉన్న 14 లక్షల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి తెలంగాణ రాష్ట్ర సమితి ముఖ్య నాయకులూ, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులూ, భారతీయ జనతా పార్టీ నుంచి కేంద్ర నాయకులు పోటా పోటీగా ప్రచారంలో పాల్గొన్నారు.

వివాస్పద మాజీ కాంగ్రెస్ నాయకుడు తూర్పు జయప్రకాష్ రెడ్డి (జగ్గారెడ్డి) ని బిజేపి అభ్యర్థిగా ఎంపిక చేయడం పట్ల పలు రాజకీయ పార్టీలనూ, రాజకీయ పరిశీలనూ ఆశ్చర్యానికి గురిచేసింది.  తెలుగుదేశం పార్టీ మద్దతుతో బిజేపి ఈ ఎన్నికను సమిష్టిగా పోరాడుతోంది.

ఈ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి అభ్యర్థిగా ప్రముఖ వ్యాపారవేత్త కొత్త ప్రభాకర్ రెడ్డి  బరిలో ఉండగా, కాంగ్రెస్ అభ్యర్థినిగా మాజీ మంత్రి వి సునీతా లక్ష్మారెడ్డి బరిలో ఉన్నారు.

బుధవారం నర్సంపెటలో జరిగిన బహిరంగ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు పాల్లొన్నారు. మెదక్ ఉపఎన్నికల ప్రచార బాధ్యతను టి ఆర్ ఎస్ తరఫున నీటి పారుదల శాఖ మంత్రి టి హరీష్ రావుకు అప్పజెప్పడం జరిగింది. హరీష్ రావు,  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉప ముఖ్యమంత్రి మహ్మద్ మహమూద్ అలీ ఆద్వర్యంలో సంగారెడ్డి, పటాన్ చెరు ప్రాంతాలలో మోటార్ సైకిల్ ర్యాలీని సమర్ధవంతంగా నిర్వహించారు. మాజీ కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత జానారెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్, మధుయాష్కీ, గీతారెడ్డి, దామోదర్ రాజనర్సింహతో సహా పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తరఫున సభలు, రోడ్ షోలలో పాల్గొన్నారు.

ప్రచారం ముగుస్తుండగా బిజేపి నుంచి కేంద్ర రైల్వే మంత్రి సదానంద గౌడ, కేంద్ర సమాచార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్లు ప్రచారంలో పాల్గొన్నారు. జగ్గారెడ్డికి మద్దతుగా బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, టిడిపి ఎం ఎల్ ఏలు దయాకర్ రావు, రేవంత రెడ్డి ప్రచారం చేశారు. గురువారం సాయంత్రానికి ఎన్నికల ప్రచార ఘట్టం ముగిసింది. శనివారం పోలింగు జరుగనుంది. మెదక్ లోక్ సభ స్థానంతో పాటు నందిగామ అపెంబ్లీ స్థానికి కూడా ఈ రోజు పోలింగ్ జరుగుతోంది. తెలుగుదేశం సభ్యుడు ప్రమాణస్వీకారానికి ముందే చనిపోయిన కారణంగా ఉపఎన్నిక అవసరమైంది. నందిగామలో పోటీ తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీల మధ్యనే ఉన్నది. వైఎస్ఆర్సీపీ ఈ ఉపఎన్నికలో పోటీ చేయడం లేదు. ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు రంగంలో ఉన్నారు. ఉపఎన్నికల ఫలితాలు ఈ నెల 16న వెలువడుతాయి.

నందిగామ ఫలితం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వెడుతుందని రాజకీయ పరిశీలకులల నిశ్చితాభిప్రాయం. నందిగామ సీటు కంటే మెదక్ సీటు అత్యంత ప్రధానమైదని. ఈ  స్థానాన్ని తెలంగాణ ప్రజాసమితి నిలబెట్టుకుంటే తెలంగాణలో అధికార పార్టీ పరువు నిలబడుతుంది. కేసీఆర్ మెదక్ లోక్ సభ స్థానానికి రాజీనామా చేసిన కారణంగా ఉపఎన్నిక అవసరం ఏర్పడింది. లోగడ కేసీఆర్ కు వచ్చిన మెజారిటీ కంటే ఈ సారి తక్కువ మెజారిటీ వచ్చినప్పటికీ టీఆర్ ఎస్ కు తలవంపులుగానే ఉంటుంది. ఈ ఎన్నికలలో కనుక బిజేపీ అభ్యర్థి విజయం సాధిస్తే కేంద్రంలో పరిపాలిస్తున్న కమలనాధుల ఆత్మవిశ్వాసం ఇనుమడిస్తుంది. బీజేపీ, తెలుగుదేశం పార్టీల బంధం మరింత గట్టిపడుతుంది. నరేంద్రమోదీ హవా ఇంకా కొనసాగుతున్నదని బీజేపీ శ్రేణులు చేస్తున్న ప్రచారానికి విశ్వసనీయత పెరుగుతుంది. ఒక వేళ కాంగ్రెస్ పార్టీ ఈ స్థానాన్ని గెలుచుకున్నట్లయితే ఆ పార్టీకి ప్రాణప్రతిష్ఠ చేసినట్టు అవుతుంది. అందుకే మెదక్ ఫలితం కోసం అన్ని పార్టీల నాయకులూ ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.