నేడు రావుగోపాలరావు జయంతి

Rao-gopala-rao

రావుగోపాలరావు. విలక్షణ నటుడు. విలనిజానికి కొత్త అర్ధం చెప్పిన వాడు. అప్పుడప్పుడు కుటుంబ పెద్దగా నటించినా విలన్ గా తనదైన శైలిలో నటించారాయన. పాత్రలో పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్ర మాత్రమే కనిపించేలా నటించడం రావుగోపాలరావుకే చెల్లింది. మన చుట్టూ ఉన్న వారే మన వెనుక గోతులు తీస్తే ఎలా ఉంటుందో తన పాత్ర ద్వారా చెప్పిన నటుడు. జగత్ కిలాడి చిత్రంలో గొంతు బాగాలేదని రావుగోపాల రావు పాత్రకి వేరే వాళ్ల చేత డబ్బింగ్ చెప్పించారు. విచిత్రం ఏమిటంటే ఆ తర్వాత తన ఆ కంఠమే తెలుగు ప్రేక్షకులకు ఆయన్ని మరింత దగ్గర చేసింది.

ముత్యాలముగ్గు. రావుగోపాలరావు విలనిజాన్ని పరాకాష్టకు తీసుకువెళ్లిన సినిమా. బాపుగారి దర్శకత్వంలో వచ్చిన ముత్యాలముగ్గులో కాంట్రాక్టర్ పాత్ర తెలుగు చిత్రసీమకే తలమానికం అయ్యింది. ఆ చిత్రంలో రావుగోపాలరావు డైలాగులు తెలుగు సమాజం ఎప్పటికీ మరచిపోదు.

బాపు ఒక్కరే కాదు పెద్ద దర్శకులంతా రావుగోపాలరావు లేకుండా ఆ రోజుల్లో సినిమాలు తీసే వారు కాదు. నాటక రంగం నుంచి వచ్చిన రావుగోపాల రావు తెలుగు సినిమాకి దొరికిన విలన్ వజ్రం. తెలుగు విలన్ కి ఆయన ప్రతీక. జనవరి 14 రావుగోపాలరావు జయంతి.

Have something to add? Share it in the comments

Your email address will not be published.