నేను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తే పార్టీ విలీనం చేస్తారా..?

mp-vijayashanti

విలీనం లేదా పొత్తు చేయనంటూ కాంగ్రెస్ కు షాకిచ్చిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి తీవ్ర విమర్శలు చేశారు. తనను కాంగ్రెస్ లో చేర్చుకున్నందునే విలీనం చేయనంటున్న టీఆర్ఎస్, తాను కాంగ్రెస్ కు రాజీనామా చేస్తే విలీనం చేస్తారా..? అని సూటిగా ప్రశ్నించారు. విలీనం చేయాలని సోనియా తమను అడగలేదన్న టీఆర్ఎస్ అలాంటప్పుడు విలీనం చేయనని కేసీఆర్ ఎలా అంటారని నిలదీశారు. కాగా, గతంలో విలీనం చేస్తామని టీఆర్ఎసే చెప్పిందన్నారు. ఈ విధంగా కన్నతల్లికే టీఆర్ఎస్ వెన్నుపోటు పొడిచిందని వ్యాఖ్యానించారు. 25 ఎంపీ సీట్లను వదులుకుని కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందని, తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ఇచ్చారని విజయశాంతి పేర్కొన్నారు.

ఆడదాన్నని కూడా చూడకుండా తనను అర్థరాత్రి పార్టీ నుంచి సస్పెండ్ చేసి షోకాజ్ నోటీసు కూడా ఇవ్వలేదన్ని మండిపడ్డారు. టీఆర్ఎస్ సస్పెండ్ చేసినా తాను ఎక్కడికి వెళ్లలేదని, పార్లమెంటులో బిల్లు పాసయ్యాకే కాంగ్రెస్ లో చేరానని చెప్పారు.ఇక దళితుడు అంటే టీఆర్ఎస్ కు ఎందుకంత చులకన..? అని ప్రశ్నించిన రాములమ్మ దళితుడిని సీఎం చేస్తానని ఒకనాడు చెప్పింది కేసీఆరే కదా అని గుర్తు చేశారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.