నేను చేసిన అభివృద్ధి ఫలాలు దొంగలపాలు కానీయను: బాబు

CBN

కృష్ణాజిల్లాలోని విజయవాడలో టీడీపీ ఆధ్వర్యంలో ‘‘మహిళ గర్జన’’సభ విజయవంతంగా ముగిసింది. ఈ సదస్సుకు మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ‘‘మహిళా గర్జన’’సభలో చంద్రబాబుకు మహిళా నేతలు ఘనంగా స్వాగతం పలికి, గజమాలతో సత్కరించారు.
విభజన నేపథ్యంలో హైదరాబాదు పురోగతి నిలిచిపోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయం సీమాంధ్రకు దక్కని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో జరుగుతున్న మహిళా గర్జన సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాదులో తాను చేసిన అభివృద్ధి ఫలాలను దొంగలపాలు కానీయనని చెప్పారు. తెలంగాణలో బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసి ఆ ఫలాలను బడుగులకు అందేలా చూస్తానన్నారు.
తాము అధికారంలోకి వస్తే రుణాలు మాఫీ చేసి రైతులను ఆదుకుంటామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. వ్యవసాయం లాభసాటి అని మళ్ళీ నిరూపిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు రావాలని ఆకాంక్షించారు. అప్పుడే రైతు సుభిక్షంగా ఉంటాడని బాబు అభిప్రాయపడ్డారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.