నేను టీ అమ్ముతా కానీ.. దేశాన్ని అమ్మను: మోడీ

వారణాసి: బీజేపీలో అట్టడుగు స్థాయి వ్యక్తులకు కూడా ప్రధాని అయ్యే అవకాశం ఉందని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ అన్నారు. టీ అమ్మే వ్యక్తి దేశానికి ప్రధాని అవుతాడా? అంటూ తనను విమర్శిస్తున్నారని.. తాను టీ అమ్ముతాను కానీ, దేశాన్ని మాత్రం అమ్మనని విపక్షాలపై విరుచుకుపడ్డారు. టీ అమ్మే వ్యక్తులకు దేశ ప్రధాని అయ్యే హక్కు లేదా? అంటూ సూటిగా ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్ వారణాసిలో జరిగిన బహిరంగ సభలో నరేంద్ర మోడీ ప్రసంగించారు.

యూపీఏ ప్రభుత్వం సామాన్య ప్రజల గోడును ఏమాత్రం పట్టించుకోవడం లేదని మోడీ ఆవేదన వ్యక్తం చేశారు. యూపీఏకు ఓట్లు మాత్రమే కావాలని విమర్శించారు. యూపీఏ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ఉత్రరప్రదేశ్ ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఎద్దేవా చేశారు. ఉత్తర ప్రదేశ్ ప్రజల సహకారంతోనే రామరాజ్యం సాధ్యమవుతుందని చెప్పారు. రైతులు, పేదల సంక్షేమాన్ని ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని అన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.