‘నేనొక్కడినే’ రిమేక్ కు అమీర్ ఖాన్ ఆసక్తి

Nenokkadine-aamirkhan

1 నేనొక్కడినే చిత్రాన్ని బాలీవుడ్ లో రీమేక్ చేయాలనుకుంటున్నారు. ఈ సినిమా విజయం విషయం పక్కనుంచితే, సినిమా టేకింగ్ కు మాత్రం మంచి గుర్తింపు లభించింది. హాలీవుడ్ స్థాయిలో ఉన్న ఈ సినిమా బాలీవుడ్ హక్కులకోసం సినీ ప్రముఖులు ఆసక్తి చూపుతున్నారు.

వైవిధ్యమైన కథలకు పెట్టిందిపేరు సుకుమార్ జగడం సినిమాతో మొదలు, ఈ యంగ్ డైరెక్టర్ ప్రతి సినిమా వైవిధ్యంగానే ఉంటాయి. ఆర్య, ఆర్య2, 100 పర్సెంట్ లవ్ సినిమాలతో తనదైన ముద్రతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు సుకుమార్. విశేషమేంటంటే సుకుమార్ దర్శకత్వం వహించిన ప్రతి సినిమా మొదట నెగిటివ్ టాక్ తో విజయం పొందినవే.

సంక్రాంతికి విడుదలైన మహేష్ బాబు సినిమా ‘1’ బాక్సాఫీసు వద్ద ఎలాంటి ఫలితాన్ని ఇచ్చినప్పటికీ, మహేశ్ బాబు మాత్రం సినిమా అవుట్ పుట్ పై సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. దర్శకుడు సుకుమార్ దర్శకత్వ ప్రతిభను, పనితనాన్ని మెచ్చుకుంటున్నారు. మళ్లీ అతనితో సినిమా చేయడానికి ఉత్సాహం చూపుతున్నారు.
ఇదంతా ప్రమోషన్ లో భాగమే అనుకున్నా కానీ, భారీ అంచనాలతో విడుదలైన 1 నేనొక్కడినే ఒక్కవర్గం ప్రేక్షకుల మెప్పు మాత్రమే పొందింది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండటం కూడా ఓ మైనస్సే ఏదేమైనా 1 చిత్రం ఇప్పుడు బాలీవుడ్ మార్కెట్ కు వెళ్లడానికి రెడీ అయిపోతోంది. 1 సినిమాలో హీరోయిన్ కృతిసనన్ కూడా అమీర్ సరసన నటించే బాలీవుడ్ ఛాన్స్ కొట్టేసింది.

‘1’ చిత్రాన్ని రీమేక్ చేయడానికి ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ఆసక్తి చూపుతున్నట్టు చెబుతున్నారు. తెలుగులో ఈ చిత్రాన్ని నిర్మించిన 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థే హిందీలో కూడా నిర్మించడానికి ప్లాన్ చేస్తోంది. ఇదిలా ఉంచితే ‘1’ సినిమాకు ఇప్పటికీ A సెంటర్లలో మంచి ఆదరణ లభిస్తోంది. అలాగే అమెరికాలో కలెక్షన్లలో ఇది రికార్డు దిశగా దూసుకుపోతోంది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.