నేరస్థులకు, డబ్బున్న వారికే వైఎస్సార్సీపీలో పదవులు

Minister-mareppa

వైఎస్సార్సీపీలో డబ్బు ఉన్నవారికి, హత్యలు చేసిన వారికే పదవులు ఇస్తారని మాజీ మంత్రి మారెప్ప విమర్శించారు. ప్రధానంగా కర్నూలు జిల్లాలో ఓ హత్య కేసులో తొమ్మిదేళ్లు జైలు జీవితం గడిపిన ఓ వ్యక్తికి పార్టీ కన్వీనర్ పదవి ఇచ్చారని చెప్పారు. వారి ద్వారా పోలీసు శాఖ బదిలీల్లోనూ అవినీతి జరిగిందని ఆరోపించారు. ఈ మేరకు హైదరాబాదు సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో మారెప్ప విలేకరులతో మాట్లాడుతూ.. వైఎస్సార్ కుటుంబానికి 2004లో 24 కోట్ల అప్పు ఉందని అలాంటిది ఈ రోజు జగన్ అత్యంత ధనవంతుడు ఎలా అయ్యాడని ప్రశ్నించారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.