నోటితో మాట్లాడి..నొసటితో వెక్కిరించినట్టుంది: హరీష్ రావు

Trs-mla-harish-rao

కాంగ్రెస్ లో టీఆర్ఎస్ విలీనం అవుతుందా?, లేదా? అనే సంశయం అందర్లోనూ నెలకొన్న తరుణంలో, టీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలు మాత్రం విలీనం లేదు, పొత్తు లేదు అనే విధంగా ఉంటున్నాయి. ఆ పార్టీ నేత హరీష్ రావు మాట్లాడిన తీరే దీనికి ఉదాహరణ. టీఆర్ఎస్ బహిష్కృత ఎంపీ విజయశాంతిని, ఎమ్మెల్యే అరవిందరెడ్డిని పార్టీలో చేర్చుకోవడం కాంగ్రెస్ కు ఎంతవరకు సమంజసమని హరీష్ ప్రశ్నించారు. కాంగ్రెస్ వ్యవహారశైలి నోటితో మాట్లాడి, నొసటితో వెక్కిరించినట్టుందని ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యల అంతరార్థం కాంగ్రెస్ లో టీఆర్ఎస్ విలీనం కాదనే అని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.