న్యాయపోరాటం చేస్తాం : దిగ్విజయ్

digvijay singh-23

తెలంగాణ సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న ఎఐసిసి ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ దిగ్విజయ్ సింగ్

హైదరాబాద్, నవంబర్ 23: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ముఖ్యమంత్రి కేసీఆర్ తమ పార్టీలో చేర్చుకోవడంపై న్యాయపోరాటం చేస్తామని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు. గాంధీభవన్ లో ఆదివారం జరిగిన కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై సమీక్షా సమావేశం, సమన్వయ్య కమిటి సమావేశం నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కేసీఆర్ వలసలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. గతంలో వైఎస్ రాజశేఖరెడ్డిగాని, కిరణ్ కుమార్ రెడ్డి గాని ఎప్పుడు వలసలను ప్రోత్సహించలేదన్నారు దిగ్విజయ్ తెలిపారు. ఫిరాయింపుల నిరోధక చట్టానికి సవరణలు చేయాలని రాబోయే పార్లమెంటులో సమావేశాల్లో డిమాండ్ చేస్తామని దిగ్విజయ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో పొన్నాల లక్ష్మయ్య, సల్మాన్ ఖుర్షీద్ తదితరులు పాల్గొన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.