న్యాయవాదుల ఆందోళన

హైదరాబాద్: ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ న్యాయవాదుల జెఎసి ఆధ్వర్యంలో న్యాయవాదులు ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ వద్ద ఆందోళనకు దిగడంతో వారిని పోలిసులు అరెస్టు చేశారు.

హైకోర్టు విభజన ఏర్పాటు చేయాలని కోరుతూ తెలంగాణ న్యాయవాద జెఎసి చలో సెక్రటేరియట్ కు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా న్యాయవాదులు విడతల వారీగా ఆందోళనకు దిగాయి. రాష్ట్రం విడిపోయిన తర్వాత హైకోర్టు ఉమ్మడిగా ఉండటం సరికాదని సీనియర్ న్యాయవాదులు ఆరోపిస్తున్నారు.

తాజాగా బుధవారం ఉదయం సెక్రటేరియట్ గేటు వద్ద ఆందోళనకు దిగేందుకు వచ్చిన న్యాయవాదులను పోలిసులు అరెస్టు చేశారు. మరో వైపు ఆంధ్రప్రదేశ్ సచివాలయంలోని చంద్రబాబునాయుడు చాంబర్ ఉన్న బ్లాక్ వద్ద నిరసనకు దిగేందుకు ప్రయత్నించిన తెలంగాణ న్యాయవాదులను పోలిసులు అదుపులోకి తీసుకొన్నారు.

అదేవిధంగా మరో దఫా ఆంధ్రప్రదేశ్ సచివాలయం వద్ద ఆందోళనకు దిగేందుకు ప్రయత్నించిన తెలంగాణ న్యాయవాదులను పోలిసులు అరెస్టు చేశారు. హైకోర్టు విభజన జరిపి ప్రత్యేక నియామకాలు చేపట్టడానికి చర్యలు తీసుకునే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని న్యాయవాదులు స్పష్టం చేస్తున్నారు.

ఇదిలా ఉండగా తెలంగాణ న్యాయవాదుల జెఎసి ప్రతినిధులు, న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిలు ముఖ్యమంత్రి కెసిఆర్ తో సమావేశమయ్యారు. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు విషయమై చర్చించారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.