న్యూ ఇయర్ కి ‘లెజండ్’ ఫస్ట్ లుక్

‘సింహా’ తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందుతున్న ‘లెజండ్’ సినిమా అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఒక బ్లాక్ బస్టర్ తర్వాత మళ్లీ అదే కాంబోలో వస్తున్న సినిమా కావడంతో, దీని మీద అంచనాలు ఎక్కువవుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే సినిమా బాగా వస్తోందని టాలీవుడ్ లో టాక్ వుంది.

ఈ నేపథ్యంలో జనవరి ఒకటిన నూతన సంవత్సరం ప్రారంభం సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అలాగే టీజర్ జనవరి 10న సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేస్తారట. చిత్రాన్ని ఫిబ్రవరిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. బాలకృష్ణ సరసన సోనాల్ చౌహాన్, రాధికా ఆప్టే కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని ఇస్తున్నాడు. బాలయ్యతో తనకిది తొలి సినిమా కావడంతో ‘ది బెస్ట్’ మ్యూజిక్ ఇవ్వడానికి దేవిశ్రీ కష్టపడుతున్నాడు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.