పట్టాలుతప్పిన ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్

train accident-13

పట్టాలు తప్పిన బెంగళూరు-ఎర్నాకులం ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్

హైదరాబాద్: కర్ణాటక-తమిళనాడు సరిహద్దులోని హోసూరు వద్ద రైలు ప్రమాదం జరిగింది. బెంగళూరు నుంచి ఎర్నాకులం వెళ్తున్న బెంగళూరు-ఎర్నాకులం ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ కు చెందిన నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి.

బెంగళూరు నుంచి ఉదయం 6 గంటలకు బయలుదేరిన బెంగళూరు-ఎర్నాకులం ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ తమిళనాడు సరిహద్దులోని కృష్ణగిరి జిల్లా అనేకల్ ప్రాంతంలో ఉదయం 7-45 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందగా మరో వందమందికి పైగా గాయాలపాలయ్యారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. స్థానికులు, అధికారులు వెంటనే అప్రమత్తమై క్షతగాత్రులను దగ్గరలోని ఆస్పత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. ఘటనా స్థలిలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు ముమ్మరం చేశారు. రైలు ప్రమాద ఘటనతో బెంగళూరు ఎర్నాకులం మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయ ఏర్పడింది.

ట్రాక్ పై పడిఉన్న బండరాయిని రైలు ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించిందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు టిట్టర్ లో తెలిపారు.

suresh prabhu

Have something to add? Share it in the comments

Your email address will not be published.