పన్నీర్‌ సెల్వంకే పట్టం

చెన్నై, సెప్టెంబర్ 28 : శనివారం బెంగళూరు ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు జయలలిత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆర్ధిక మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న పన్నీర్ సెల్వంను అన్నాడీఎంకే  ఆయనను శాసనసభా పక్ష నాయకుడిగా ఎన్నుకుంది.

టాన్సీ భూ కుంభకోణం కేసులో జయలలిత 2001లో జైలుకెళ్లడంతో మొట్ట మొదటి సారిగా పన్నీర్‌సెల్వం ముఖ్యమంత్రిగా భాధ్యతలు చేపట్టారు. జయలలిత జైలు నుంచి తిరిగి వచ్చేంతవరకు 6 నెలల పాటు ఆయన ఈ పదవిలో కనసాగారు. పన్నీర్ సెల్వంను అన్నాడీఎంకే  శాసనసభా పక్ష నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో ఆయన రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

ఈ నేపథ్యంలో తమిళనాడులో కొత్త మంత్రివర్గం ఏర్పాటుచేయాలని అన్నీడీఎంకే శాసనసభా పక్షనేతగా ఎన్నికయిన పన్నీర్ సెల్వంకు ఆ రాష్ట్ర గవర్నర్ రోశయ్య ఆహ్వానం పంపారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.