పవన్ కళ్యాణ్ కి గుండు గీయిస్తా: షబ్బీర్ అలీ

Shabbir-ali-on-pavan

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కు పరిటాల రవి సగం గుండు గీయించాడని, తాను మాత్రం పూర్తి గుండు గీయిస్తానని పీసీసీ ప్రచార కమిటీ ఉపాధ్యక్షుడు షబ్బీర్ అలీ హెచ్చరించారు. కామారెడ్డిలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ హఠావో దేశ బచావో అనడం కాదని, ముందు నీ ఇంటిని సరిదిద్దుకో అని సూచించారు. ఇంట్లో భార్యను కంట్రోల్ చేయలేని వాడు రాజకీయాల్లో సమాజాన్ని ఎలా అభివృద్ధి చేస్తాడో చెప్పాలని నిలదీశారు. గబ్బర్ సింగ్ నువ్వో నేనో తేల్చుకుందామని షబ్బీర్ అలీ సవాలు విసిరారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.