పవన్ కళ్యాణ్ పై కేసీఆర్ వ్యంగ్యాస్త్రాలు

kcr-trs

సినీ హీరో పవన్ కళ్యాణ్ పై టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యంగాస్త్రాలు విసిరారు. అలిసిపోయి అన్న దుకాణం బంద్  పెడితే ఇప్పడు తమ్ముడొచ్చి మళ్లీ ఓపెన్ చేస్తున్నాడన్నారు. సంక్రాతి గంగిరెద్దుల్లా, ఒకరి తర్వాత ఒకరు వస్తున్న, సినిమా యాక్టర్లను చూసి ఆగం కావద్దొన్నారు. రాష్ట్రవిభజన చట్టబద్ధమైపోయిందని, ఇక దాన్ని ఆపడం ఎవరి తరమూ కాదన్నారు. రాష్ట్ర విభజనను ఆపుతామంటూ కొందరు సీమాంధ్రనేతలు ప్రజలను మభ్యపెడుతున్నారని ఆయన తెలిపారు. తెలంగాణాలో విద్య, ఉద్యోగాలు రాజకీయాల్లో, గిరిజనులకు 12శాతం రిజర్వేషన్లు కల్పించి, వారి సంస్కృతిని కాపాడుతామన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.