పవన్ కోసం ఆశగా ఎదురుచూస్తున్న దిల్ రాజు

pavan-kalyan-dil-raju

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే అభిమానులకే కాదు ప్రతీ ఒక్కరికీ అమితమైన అభిమానం. ట్రెండ్ సెట్ చేయాలన్నా… దాన్ని తిరగ రాయాలన్నఅది పవన్ కళ్యణ్ కే సాధ్యం. అలాంటి పవర్ స్టార్ తో సినిమా తీయాలని ప్రతీ నిర్మాతకీ ఉంటుంది. అయితే ఆ అవకాశం కోసం ఎదురుచూస్తున్న వాళ్లలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూడా ఉన్నారు. ఎన్నో అద్భుతమైన, విజయవంతమైన చిత్రాలను నిర్మించినప్పటికీ పవన్ కళ్యాణ్ తో చేయాలని దిల్ రాజు ఎప్పటినుండో ఎదురుచూస్తున్నాడు.

ఎప్పటికప్పుడు ఏదో ఒక వంకతో అవకాశం చేజారుతున్నప్పటికీ, పట్టువదలని విక్రమార్కుడిలా దిల్ రాజు తన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ కోసం తాజాగా ‘జనగణమన’ అనే టైటిల్ ను దిల్ రాజు రిజిస్టర్ చేసినట్లు సమాచారం. ఆ టైటిల్ కి తగ్గ కథను కూడా తయారు చేస్తున్నట్లు చెబుతున్నారు. మరీ పవన్ ఈ సారైనా దిల్ రాజు కి ఛాన్స్ ఇస్తాడో లేదో చూడాలి.

Have something to add? Share it in the comments

Your email address will not be published.