పవన్ పార్టీ పెట్టకపోవడమే మంచిది: తమ్మారెడ్డి భరద్వాజ

Tammareddy-bharadwaja

సినీ నటుడు పవన్ కల్యాణ్ త్వరలో పార్టీ పెట్టబోతున్నారని కొన్ని రోజుల నుంచి వస్తున్న వార్తలపై దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ… ఆరు నెలల ముందే పవన్ పార్టీ పెడితే బాగుండేదని అభిప్రాయపడ్డారు. అప్పుడయితే మంచి అభ్యర్థులను వెతికే అవకాశం ఉండేదన్నారు. ఇప్పుడు పార్టీ పెట్టడం వల్ల ఇతర పార్టీల్లో టిక్కెట్లు రాని వారు, లంచగొండులు, దొంగలు మాత్రమే చేరతారన్నారు. క్లీన్ ఇమేజ్ ఉన్న పవన్ అసలు పార్టీ పెట్టకపోవడమే మంచిదని సూచించారు. ఒకవేళ పార్టీ పెడితే గతంలో చిరంజీవి చేసిన తప్పే చేసినట్లవు తుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రానికి పార్టీ అవసరమే కానీ చాలా ఆలస్యమయిందని, ఎన్నికల తేదీలు కూడా ఖరారయ్యాయని భరద్వాజ చెప్పారు. ఈ సమయంలో సరయిన అభ్యర్థులు దొరకడం కష్టమని చెప్పారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.