పవన్ పార్టీ పెట్టడం లేదు..?!

Pavan-kalyan-political-entry

పవన్ కళ్యాణ్ పార్టీ గురించి రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. పీఆర్పీ (పవన్ రిపబ్లికన్ పార్టీ) ప్రారంభమవుతుందని అభిమానులు కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. చిరంజీవి ప్రజారాజ్యం విషయంలో అభిమానులకు ఛేదు అనుభవం ఎదురైనా … పవన్ పార్టీపై ఇంకా ఎదురుచూస్తూ ఉండటం విశేషం.

అయితే ఇదంతా ప్రక్కకు పెడితే అసలు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టడం లేదట. ఫిబ్రవరి 13న ఏర్పాటుచేసే సమావేశంలో కేవలం పుస్తకావిష్కరణ సమావేశం మాత్రమే ఉంటుందని, పార్టీ ప్రకటన ఉండదని సమాచారం. కానీ రాష్ట్రవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ తరుపున అభ్యర్ధులను నిలబెడతారట. దీనికి సంబంధించి నియోజక వర్గాల ఎంపిక, అభ్యర్ధుల ఎంపిక జరిగిపోయిందని వార్తలు వస్తున్నాయి.

మొత్తం 60 అసెంబ్లీ స్థానాల్లో, 10 లోక్ సభ స్థానాల్లో పవన్ అభ్యర్థులు పోటీ చేస్తారు. ఈ అరవైలో 35 సీమాంధ్రలో, 25 తెలంగాణలో ఉన్నాయి. పవన్ కళ్యాణ్ సామాజిక వర్గీయులు ఎక్కువగా ఉండే నియోజక వర్గాల్లో ఈ అభ్యర్థులు బరిలో ఉంటారట. వాళ్లంతా ఇండిపెండెంట్ హోదాలో పోటీ చేస్తారని, పవన్ కళ్యణ్ వారి తరుపున ప్రచారం చేస్తారట.

Have something to add? Share it in the comments

Your email address will not be published.